రష్యాలో 26కి పైగా వ్యాక్సిన్లపై పరిశోధనలు

నాలుగు వ్యాక్సిన్లు అన్ని విధాలా సురక్షితం అంటున్న రష్యా ప్రధాని

russia coronavirus vaccine

రష్యా: కరోనా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రష్యాలోని ప్రభుత్వ రంగ సంస్థ గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే కీలక దశలు అధిగమించి క్లినికల్ ట్రయల్స్ లోనూ అమోఘమైన ఫలితాలను ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రష్యా నుంచి మరో మూడు వ్యాక్సిన్లు కూడా క్లినికల్ ట్రయల్స్ దశలోకి ప్రవేశించాయి.

దీనిపై రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ మాట్లాడుతూ, తమ దేశంలో 26 కంటే ఎక్కువ వాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని, అందులో 4 వ్యాక్సిన్లు సురక్షితమైనవిగా భావిస్తున్నామని తెలిపారు. ఆ నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగించేందుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నామని మిషుస్తిన్ వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/