తేలికగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

ఆరోగ్యం-జాగ్రత్తలు

Easy Cancer‌ Diagnosis Tests
Easy Cancer‌ Diagnosis Tests

ఆధునిక జీవనశైలి విధానం, ఆహార నియమాల్లో గణనీయమైన మార్పులు, అధిక ఒత్తిడి, స్థూలకాయంతో నేడు కేన్సర్‌ అనేది సాధారణ జబ్బుగా మారితున్నది.

కేన్సర్‌ చికిత్సకు సంబంధించి ఇటీవల కాలంలో వైద్యనిపుణులు కొన్ని ఘనమైన విజయాలనే సాధించారు. వీటి ఫలితంగా కొన్నిరకాల కేన్సర్‌ వ్యాధి నిర్థారణ పరీక్ష పద్ధతులు మరింత తేలికగా మారాయి. చికిత్సా పద్ధలితులు మరింత ప్రభావంతంగా మారాయి.

కేన్సర్‌ చికిత్సలో వైద్యనిపుణులు ఇటీవల సాధించినకొన్ని కీలకమైన విజయాలు..కేన్సర్‌ నిర్థారణ పరీక్షల్లో బయాప్సీ గురించి చాలామందికి తెలిసినదే.

కేన్సర్‌ ఉన్నదీ లేనిదీ నిర్థారించేందుకు అనుమానాస్పద కణితుల నుంచి ఒక చిన్న ముక్కను కోసి పరీక్షిస్తారు.

ఆ ముక్కలోని కణజాలంలో ఉన్న కణాల విభజన సజావ్ఞగా పోతే కేన్సర్‌ ఉన్నట్లు రూఢి చేసుకుని వెంటనే వ్యాధిని నయం చేసేందుకు తగిన చికిత్సను ప్రారంభిస్తారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న బయాప్పీ పరీక్షలు సాలిడ్‌ బయాప్సీ పరీక్షలే. ఇక లిక్విడ్‌ బయాప్సీని ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు. రోగి నుంచి సేకరించిన రక్తనమూనాలోనే కేన్సర్‌ కణాల ఆనవాళ్లను డిఎన్‌ఎ ఏస్థాయిలో ప్రారంభ దశలోనే గుర్తించేందుకు దోహదపడే పరీక్ష ఇది.

రొమ్ము కేన్సర్‌ వంటి కొన్ని రకాల కేన్సర్లను ఈ లిక్విడ్‌ బయాప్సీ ద్వారా తేలికగానే తొలిదశలోనే గుర్తించేందుకు వీలుంటుంది. ఫలితంగా, చాలా వరకు మరణాలను నివారిం చేందుకు కూడా అవకాశం ఉంటుంది.

గడచిన పాతికేళ్లలో లిక్విడ్‌ బయాప్సీ పరీక్ష పద్ధతుల్లో శాస్త్రవేత్తలు గణనీయమైన పురోగతిని సాధించారు. భవిష్యతుతలో సాలిడ్‌ బయాప్సీ పరీక్షలకు ఇది పూర్తిస్థాయి ప్రత్యామ్నా యంగా మరే అవకాశాలు కూడా ఉన్నాయని వారు భరోసా ఇస్తున్నారు.

ఆరిస్‌ హెల్త్‌ మోనార్త్‌:

ఊపిరితిత్తుల కేన్సర్‌ చికిత్సలో వైద్యనిపుణులు రూపొందించిన తాజా అస్త్రం ఇది. ఇండియానా పోలిస్‌లోని ఫ్రాన్సిస్కన్‌ హెల్త్‌ కేన్సర్‌ సెంటర్‌ ఊపిరితిత్తుల కేన్సర్‌ శస్త్రచికిత్సలను మరింత సమర్థంగా నిర్వహించే లక్ష్యంతో ఇటీవల ఈ రోబోటిక్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.

ఇది బ్రోంకోస్కోపి క్‌ పరీక్షలను వరింత సరళతరం చేస్తుంది. మరింత నిర్దిష్టంగా కేన్సర్‌ కణాలను చేరుకుని, వాటిని నిర్మూలించేందుకు దోహ దపడుతుంది. ప్రాణాంతకమైన కేన్సర్‌లో ఊపిరితిత్తుల కేన్స ర్‌దే అగ్రస్థానంగా చెప్పుకోవచ్చు.

ఊపిరితిత్తుల కేన్సర్‌ రోగుల్లో దాదాపు 81శాతం మంది వ్యాధి నుంచి కోలుకోకుండానే మరణిస్తున్నారని, దీనివల్ల ఊపిరితిత్తుల కేన్సర్‌ మరణాలను చాలావరకు నివారించవచ్చని ప్రముఖ అమెరికన్‌ పల్మనాలజిస్ట్‌ వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇమ్మూనోథెరపీతో ప్రయోజనాలెన్నో..

ఇమ్యూనోథె రపీ ఆలోచన రెండు శతాబ్దాల కిందటిదే అయినా, కార్యాచరణలో అందుబాటులోకి వచ్చినది మాత్రం ఇటీవల కాలంలోనే రోగనిరోధక వ్యవస్థలోని ప్రతికూలతలను నిరోధించడం ద్వారా కేన్సర్‌ కణాలను నిర్మూలించడం సాధ్యమవుతుందని తమ పరిశోధనల్లో ప్రయోగాత్మకంగా నిరూపించిన కారణంగా అమెరికన్‌ వైద్యనిపుణుడు జేమ్స్‌ పి ఆలిసన్‌, జపానీస్‌ వైద్యనిపుణుడు

తసుకు హోంజోలకు 2018 సంవత్సరంలో నోబెల్‌ బహుమతి లభించింది. కేన్సర్‌ కణాలపై పోరాడే విధంగా రోగనిరోధక వ్యవస్థను సమాయాత్తం చేసే లక్ష్యంతో చేసే చికిత్సనే ఇమ్యూనోథెరపీ అంటారు.

ఇలా రోగ నిరోధక వ్యవస్థను కేన్సర్‌పై పోరాడేలా సంసిద్ధం చేయడం ద్వారా కేన్సర్‌ను నయం చేయవచ్చనే సిద్ధాంతాన్ని జర్మన్‌ వైద్యులు డబ్ల్యూబుష్‌ , ఫ్రెడరిక్‌ ఫెలీసెస్‌లు 19వ శతాబ్ది తొలినాళ్లలోనే ప్రతిపాదించారు.

అమెరికన్‌ వైద్యనిపుణుడు విలియమ్‌ బీకోలే 1909లో ఈ సిద్ధాంతం సరైనదేనని ధ్రువీకరించాడు. సైద్ధాంతిక చర్చల్లోనే ఇన్నాళ్ల నలుగుతూ వచ్చిన ఈ ప్రక్రియ ఇటీవలే అందుబాటులోకి రావడంతో కేన్సర్‌ చికిత్స పద్ధతుల్లో మరో ముందడుగు మొదలైంది.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కీమోథెరపీ, రేడియోథెరపీల కంటే ఇమ్యూనోథెరపీ ద్వారా కేన్సర్‌ను మరింత సులువుగా అరికట్టడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో విస్తరిస్తున్న కేన్సర్‌:

భారత్‌లో కేన్సర్‌ శరవేగంగా విస్తరిస్తోంది. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2017 నుంచి 2018 మధ్యకాలంలో అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే భారత్‌లో కేన్సర్‌ కేసులు 300శాతం మేరకు పెరిగాయి.

భారత్‌లో 2017లో కొత్తగా 39,635 కేన్సర్‌ కేసులు నమోదైతే, 2018 నాటికి ఈ సంఖ్య 1.60లక్షలకు చేరుకుంది.

దీంతో 2017 నాటికి 3.5 కోట్లుగా ఉన్న మొత్తం కేన్సర్‌ రోగులసంఖ్య 2018 నాటికి 6.6 కోట్ల మేరకు చేరుకుంది. జీవనశైలిలో మార్పులు, బద్ధకపు జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, పెరుగుతున్న స్థూలకాయం, ఆహారపు అలవాట్లలో మార్పులు, పొగాకు ఉత్పత్తులు, మద్యం వినియోగం కారణంగా భారత్‌లో కేన్సర్‌ కేసులు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గడచిన కొన్నేళ్లుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కేన్సర్‌ నియంత్రణ, నిరోధం కోసం చేపడుతున్న జాతీయ కార్యక్రమం ఫలితంగా భారత్‌లో కేన్సర్‌ వల్ల సంభవిస్తున్న మరణాల రేటు కొంత తగ్గుముఖం పట్టింది.

అంతర్జాతీ యంగా చూసుకున్నా, కేన్సర్‌ మరణాల రేటులో భారత్‌ కొంత నయంగా ఉన్నట్లే చెప్పుకోవచ్చు.

భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు సగటున 72.21 మరణాలు సంభవిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు జరిపించు కుంటూ, తొలి దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే, కేన్సర్‌ మరణాల ఖ్యను మరింతగా తగ్గించవచ్చని ఢిల్లీలోని వైద్యులు చెబుతున్నారు.

కేన్సర్‌ చికిత్సా పద్ధతుల్లో ఇటీవల శరవేగంగా పరిణామం చెందుతున్న చికిత్సా పద్ధతి అడాప్టివ్‌ సెల్‌ట్రాన్స్‌ఫర్‌ థెరపీ, కేన్సర్‌ కణాలు ఉన్న చోటుకు టీ-కణాలను పంపడం ద్వారా వాటిని నిర్మూలించే ఆలోచనలతో శాస్త్రవేత్తలు దాదాపు యాభయ్యేళ్ల కిందటే పరిశోధనలను ప్రారంభించారు.

రోగనిరోధక కణాలైన టీ-కణాలను రోగి శరీరం నుంచి గాని, లేదా ఇతరుల శరీరం నుంచి గాని సేకరించి, కేన్సర్‌ కణాలను ఎదుర్కొనే రీతిలో వాటికి జన్యుపరంగా మార్పులు చేసి, రోగి శరీరంలో కేన్సర్‌ సోకిన భాగాలకు ఎక్కిస్తారు.

ఈ పద్ధతిని ఆచరణలోకి తెచ్చేదిశగా వైద్యనిపుణులు దాదాపు దశాబ్దకాలంగా ప్రయోగాలను వేగవంతం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/