చిన్నవర్తకులను ప్రశంసించిన ప్రధాని మోడి

ప్రజలకు నిత్యావసరాల సరఫరాలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దేశంలోని చిన్నవర్తకులను ప్రశంసించారు. కరోనా నేపథ్యంలో దేశం విపత్తును ఎదుర్కొంటున్న వేళ ఫ్రాణాలు పణంగా పెట్టి ప్రజా జీవితంలో తమదైన పాత్రపోషించిన వారి సేవలను అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు.”లాక్‌డౌన్‌తో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటే వారి కనీస అవసరాలు తీరాలి. లేదంటే వారు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కుతారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల సరఫరాలో చిన్న వ్యాపారులే కీలకపాత్ర పోషించారు. వారే లేకుంటే…అన్నది ఊహించుకోవడమే సాధ్యం కావడం లేదన్నారు.వారి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ‘ఇక, భౌతిక దూరం పాటించడంలో ప్రజల సహకారం మరువలేనిది. షాపుల వద్ద కనీస దూరాన్ని పాటిస్తూ తమకు కావల్సిన వస్తువులు కొనుక్కుని సహకరించారు. భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి” అని ప్రధాని ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/