2021లో జిడిపి 9.5% నెగిటివ్‌

నాలుగో త్రైమాసికానికి సానుకూలం: ఆర్‌బిఐ గవర్నర్‌

RBI
RBI

ముంబై : 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 9.5శాతం మేర క్షీణించవచ్చునని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.

అక్టోబరు 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బిఐ ఎంపిసి భేటీ అయింది.

ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను దాస్‌ మీడియాకు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 23.9శాతం ప్రతికూలత నమోదు చేసింది.

నాలుగో త్రైమాసికం నాటికి జిడిపి పాజిటివ్‌గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా నేపథ్యంలో నిన్నటి వరకు ఉన్న మానసిక భయం, నిరాశ నుంచి ఆశ వైపు వెళ్తోందని శక్తికాంతదాస్‌ అన్నారు.

నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యానికి చేరువగా ఉంటుందన్నారు. జిడిపి వృద్ధి రేటు నాలుగో త్రైమాసికం నాటికి సానుకూలంగా ఉండవచ్చునన్నారు.

వివిధ రంగాలు ఆర్థికంగా వేగంగా కోలుకుంటున్నాయన్నారు. వ్యవసాయం, వినియోగవస్తువులు, పవర్‌, ఫార్మా రంగాలు చాలా వేగంగా రికవరీ అవుతున్నాయన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.5శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేశారు. సెప్టెంబరు నెలలో పిఎంఐ 56.9శాతానికి పెరిగిందన్నారు. జనవరి 2012 నుంచి ఇది గరిష్టం.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/