వాళ్లు మానవాళికి శత్రువులు.. ఆదిత్యనాథ్‌

క్వారంటైన్‌ కేంద్రంలో వైద్యసిబ్బందిపై దాడి.. ఆగ్రహించిన సిఎం

yogi aadityanath
yogi aadityanath

లక్నో: గత కొన్ని రోజుల కిందట ఢీల్లీ లో మత సమ్మేళనానికి వందలమంది హజరయ్యారు. అందులో కొందరు కరోనా బారిన పడగా, మరికొందరు క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే యూపీలోని ఘజియాబాద్‌లో ఉన్న క్వారంటైన్‌ కేంద్రంలోని వారు అక్కడి నర్సులు, వైద్యసిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనను సిఎం యోగి ఆదిత్య నాథ్‌ తీవ్రంగా ఖండించారు. వైద్యసిబ్బందిపై దాడిచేసిన వారిని మానవాళికి శత్రువులుగా అభివర్ణించారు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వారు చట్టాన్ని గౌరవించరు, ప్రభుత్వ ఆదేశాలను అంతకన్నా పాటించరు. ఇలాంటి వారిని వదిలిపెట్టేదిలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/