మార్చి వచ్చింది..వంట గ్యాస్ ధరలు పెరిగాయ్

increased lpg gas cylinder prices

సామాన్య ప్రియులకు మంట పుట్టించే వార్త. నెల మారిందంటే చాలు ఏ వస్తువుల ధరలు ఎంతెంత పెరుగుతాయో అని సామాన్య ప్రజలు ఖంగారు పడుతూ ఉంటారు. వారి ఖంగారుకు తగ్గట్లే మార్చి నెల వచ్చిందో రాలేదో గ్యాస్ సంస్థలు సామాన్యులపై భారం మోపాయి. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది. అలాగే, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది.

దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ పెరుగుదలతో.. కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతుంటే..ఇప్పుడు గ్యాస్ ధర ఏకంగా రూ. 50 పెంచడం ఫై కేంద్రం ఫై నిప్పులు చెరుగుతున్నారు. మోడీ దిగితే కానీ సామాన్యుడు బ్రతకలేడని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది నెలల తర్వాత డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరగటం మళ్ళీ ఇప్పుడే తొలిసారి. అయినా పెరిగిన ధర సామాన్యులకు, మధ్యతరగతి ప్రాలకు ఊహించని షాక్ అనే చెప్పాలి.

పెరిగిన ధరలతో ఢిల్లీ లో గ్యాస్ ధరలు చూస్తే..కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2119 రూపాయలకు చేరుకుంది. ఇంతకుముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1769 రూపాయలుగా ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 350.50 పైసలు పెంచడంతో ప్రస్తుతం ఢిల్లీలో రూ. 2119.50 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గా ఉంది.

కలకత్తాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1870 రూపాయల నుంచి 2221 రూపాయలకు పెరిగింది. ముంబైలో ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ ధర 1721 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం దీని రేటు 2071 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర కమర్షియల్ ఇంతకుముందు 1917 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 2268 రూపాయలకు పెరిగింది.