బైరి నరేష్ ను పిచ్చికుక్కను కొట్టినట్లు కొట్టాలి – చికోటి ప్రవీణ్

అయ్యాప్పస్వామి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బైరి నరేష్ ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాలని అన్నారు క్యాసినో ఫేమ్ చికోటి ప్రవీణ్. కొద్దీ రోజుల క్రితం చికోటి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన సంగతి తెలిసిందే. క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని, ప్రవీణ్ తో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని, అలాగే సినీ పరిశ్రమ కు సంబదించిన వ్యక్తుల తోనే ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.

ఇదిలా ఉంటె తాజాగా చికోటి ప్రవీణ్ …బైరి నరేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. సోమవారం బైరి నరేష్ ఫై కొంతమంది అయ్యప్ప భక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. భైరి నరేష్‌పై జరిగిన దాడిని ప్రవీణ్ సమర్ధించాడు. దాడి చేసిన వారికి పాదాభివందనాలు అంటూ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ వీడియో ను ప్రవీణ్ విడుదల చేసాడు.

‘భైరి నరేష్‌పై దాడికి పాల్పడ్డ అయ్యప్ప భక్తులు, హిందూ సోదరులందరికీ పాదాభివందనాలు. ఇటువంటి కుక్కలు రోడ్డుపై ఎక్కడ కనబడినా తరిమితరిమి కొట్టాలి. ఎవరు కొట్టినా వాళ్ల తరపున నేను నిలబడతా. వారందరికీ నా సపోర్ట్ ఉంటుంది. నాకు కనబడినా పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతా. ఎవరైనా హిందూ ధర్మంపై లేదా హిందూ దేవుళ్లు, దేవతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతాం. హిందూ సోదరులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.