రాబోయే ఎన్నికల్లో పోటీపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నిర్ణయం

rajasingh
rajasingh

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రాబోయే ఎన్నికల్లో పోటీ ఫై కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై విధించిన సస్పెన్షన్​ను బీజేపీ తొలగించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు తాను పెద్ద అభిమానినని, పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇక ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణ సర్కార్ రాజాసింగ్ కు కొత్త బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. గతంలో రాజాసింగ్ కు కేటాయిచిన బులెట్ ప్రూఫ్ వాహనం అనేక సార్లు ఆగిపోవడం..పలుమార్లు మొరాయించడం జరిగింది. మొన్నటికి మొన్న నడి రోడ్డు ఫై ఆగిపోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఎన్నోసార్లు బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వానికి తెలియజేసిన పట్టించుకోలేదు. ఈసారి మాత్రం పాత వాహనం ప్లేస్ లో మరో వాహనాన్ని కేటాయించింది. పోలీసులు సోమవారం ఆయనకు వేరే వాహనాన్ని సమకూర్చారు. 2017 నాటి ఈ వాహనాన్ని రాజాసింగ్ ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు.