అందుకే దాని పేరు స్కాంగ్రెస్‌గా మారిపోయిందిః మంత్రి కెటిఆర్‌

కాంగ్రెస్‌ది కుంభకోణాల వారసత్వం అంటూ ఎద్దేవా

Congress levying ‘election tax’ on Bengaluru builders: KTR

హైదరాబాద్‌ః కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ మరోసారి విమర్శలు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. రాబోయో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌కు నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై అక్కడి ప్రభుత్వం పన్ను విధిస్తున్నదని విమర్శించారు. ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను విధించడం ప్రారంభించిందని కెటిఆర్ ట్వీట్ చేశారు.

‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు. ఈ ముసలి పార్టీ, దాని కుంభకోణాల వారసత్వం ఎంతో పురాతనమైది. అందుకే దాని పేరు స్కాంగ్రెస్‌గా మారిపోయింది. ఆ పార్టీ వాళ్లు తెలంగాణలో ఎంత డబ్బు వెదజల్లినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరు’ అని ట్వీట్‌ చేశారు. తెలంగాణలో స్కాంగ్రెస్‌ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.