కాసేపట్లో బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి పాల్గొననున్న సీఎం జగన్

Vijayawada: దాదాపు రూ 22 వేల కోట్లతో అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి గడ్కరీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం నితిన్ గడ్కరీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఇందిరిగాంధీ స్టేడియంలో ఎన్‌హెచ్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
‘తెర’ సినిమా వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/