ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియామకం
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసి ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం… ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/