దేశంలో కొత్తగా 2,786 కరోనా కేసులు

2,786 new corona cases in india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. ఇందులో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,847 మంది కరోనాకు బలయ్యారు. మరో 26,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు 6 మరణించగా, 2557 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/