బియ్యం కుంభకోణాన్ని బట్టబయలు చేయాలి : అమిత్ షా

తెలంగాణ బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం


న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ శ్రేణులకు పార్టీ అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలని, కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

హుజూరాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయభేరి మోగించాలని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి… ప్రభుత్వ పరంగా ఏంచేయాలో మాకు వదిలేయండి అని ఉద్బోధించారు. ఇకపై తెలంగాణలో తరచుగా పర్యటిస్తానని పార్టీ వర్గాలకు హామీ ఇచ్చారు.

తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/