హోలీ శుభాకాంక్షలు తెలిపిన పాక్‌ ప్రధాని

శుభాకాంక్షలపై పలువురి ఆగ్రహం

Imran-Khan
Imran-Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశంలో ఉన్న హిందువులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మన హిందూ సమాజానికి రంగులతో నిండిన హోలి పండుగ శుభాకాంక్షలు. ఈపండుగ హిందూ సమాజానికి ఓదార్పు, భద్రతకు మూలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ఇమ్రాన్‌ఖాన్‌ ట్విట్‌ చేశారు. అయితే ప్రధాని శుభాకాంక్షలు తెలుపడంపై ఆదేశానికి చెందిన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రధాని అయివుండి హిందువులకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా మరికొంత మంది మాత్రం పాకిస్థాన్‌లో హిందువులు, ముస్లింలు సమానమేనని, ఎవరి హక్కులు వాళ్లకు ఉంటాయన్న విషయాన్ని ప్రధాని మరోసారి చాటిచెప్పారని కొనియాడుతున్నారు. కాగా పాకిస్థాన్‌లో కూడా భారత్‌లో చేసుకున్నట్లుగానే హిందువులు అన్ని పండుగలు చేసుకుంటుంటారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/