రేవంత్‌ రెడ్డి పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగగా, అది రేపటికి వాయిదా పడింది. రేవంత్‌ రెడ్డి తాజా గండిపేట పరిధిలో అరెస్టయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి కూకట్ పల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రేపటికి వాయిదా వేసింది. వాదనల సందర్భంగా…. తన క్లయింటుపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు బనాయించారని ఆరోపించారు. కాగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ కు సంబంధించిన ఫాంహౌస్‌పై అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేసిన కారణంగా రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/