మార్చి 1 నుంచి తెలంగాణ లో ఉచిత కరెంట్ అమలు..?

తెలంగాణ లో ‘గృహజ్యోతి’ పథకం కింద మార్చి 1 నుంచి ఉచిత కరెంట్ ను అమల్లోకి తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. తొలి విడతలో 34లక్షల గృహాలకు మార్గదర్శకాలను అనుసరించి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారట. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే ఫ్రీ కరెంట్ కు అర్హులని, ఆధార్ తో రేషన్ కార్డు తో అనుసంధానమై ఉండాలని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఇక గృహజ్యోతి స్కీమ్ మార్గదర్శకాలు ఇవే అని వినికిడి..

  • తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
  • రేషన్ కార్డు ఆధార్తో లింకై ఉండాలి
  • విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లు మించినా, బిల్లులు పెండింగ్లో ఉన్నా పథకం వర్తించదు
  • 2022-23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే అనర్హులు
  • గత ఏడాదిలో నెలకు సగటున వాడిన విద్యుతు అదనంగా 10% మాత్రమే ఉచితం
  • అనుమతించిన పరిమితికి లోబడి వాడకం ఉంటేనే జీరో బిల్లులు
  • అదనపు విద్యుత్కు బిల్లు చెల్లింపు