తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు

ఎల్లుండి.. 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్

2 days holidays for educational institutions in Telangana

హైదరాబాద్‌ః శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లుండి… గురువారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంతో పాటు తెలంగాణలోని పలుచోట్ల విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవును ప్రకటించారు.