పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు సంబదించిన ముగ్గురికి పద్మ అవార్డ్స్ దక్కడం విశేషం. తెలంగాణ కు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, నారాయణపేట జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి లకు పద్మ శ్రీ అవార్డ్స్ దక్కాయి.

పద్మశ్రీ వీరికే..

దుఖు మజ్హి – సింద్రీ గ్రామ పర్యావరణ కార్యకర్త
చెల్లమ్మాళ్ – అండమాన్‌కు చెందిన సేంద్రియ రైతు
హేమ్‌చంద్ మాంఝీ – నారాయణ్‌పూర్‌కు చెందిన మెడిసినల్ ప్రాక్టీషనర్
యానుంగ్ జమోహ్ లెగో – అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన హెర్బల్ మెడిసిన్ నిపుణుడు
సోమన్న – మైసూరుకు చెందిన గిరిజన సంక్షేమ కార్యకర్త
సర్బేశ్వర్ బాసుమతరీ – చిరంగ్ ప్రేమ ధనరాజ్‌కు చెందిన గిరిజన రైతు
వీరితో పాటు మొత్తం 34 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రధానం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో అందజేస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. గత ఏడాది ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి.