కాణిపాకం ఆలయ ఉద్యోగికి కరోనా

2రోజుల పాటు ఆలయం మూసివేత

Vinayaka Temple-Kanipakam
Vinayaka Temple-Kanipakam

kanipakam: కాణిపాకంలో కరోనా కలకలం సృష్టించింది. ప్రసిద్ధ వరసిద్ది వినాయక ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డుకు కరోనా సోకింది.

దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. రెండు రోజులపాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

మొత్తం 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాటివ్‌గా నిర్దారణ అయ్యిందని తెలిపారు.

ఈ నెల 11న తిరుమలలోని గోవిందరాజ స్వామి ఆలయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా సోకడంతో ఆలయాన్ని రెండు రోజులపాటు మూసివేశారు. ఆలయాన్ని శానిటైజేషన్‌ చేసిన తర్వాత 14వ తేదీ నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఈ నెల 10న తెరవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆలయ ప్రధాన అర్చకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో గుడిని మూసివేసిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/