స్మశానమే అతడికి క్లాస్ రూమ్ అయ్యింది

కరోనా కారణంగా ఇంకా చాల విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. దీంతో చాలామంది స్టూడెంట్స్ ఫోన్ల ద్వారా క్లాస్ లు వింటున్నారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ కు మాత్రం ఫోన్ సిగ్నల్ ఇబ్బంది గా మారింది. సిగ్నల్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్లాస్ లు వింటున్నారు. ఇక్కడ రోహిత్ అనే స్టూడెంట్ మాత్రం స్మశానం లో క్లాస్ లు వింటున్నాడు. ఓ పక్క శవం కాలుతున్న కానీ ఏమాత్రం పట్టించుకోకుండా క్లాస్ వింటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని ఓరియంటల్ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ చదవుతున్నాడు. కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే వాటిని వినేందుకు రోహిత్ ఫోన్‌లో సిగ్నల్ సహకరించడం లేదు. అతడు సిగ్నల్ కోసం వెతకని ప్రాంతం లేదు. చివరికు మడగూడెం శివారులోని వైకుంఠ ధామంలో సిగ్నల్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కూర్చొని వైకుంఠ ధామంతో ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. చదువు మీదున్న ఆసక్తితో శవాలను దహనం చేసేచోటే ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే క్లాసులు వింటున్నాడు. చదువు ఫై రోహిత్ కు ఉన్న ఇంట్రస్ట్ చూసి అంత మెచ్చుకుంటున్నారు.