మునుగోడులో గెలిచేది నేనే .. రాజగోపాల్ రెడ్డి ధీమా

తన దెబ్బకు కేసీఆర్ మునుగోడుకు వస్తున్నాడన్న కోమటిరెడ్డి

I am the one who won in Munugoda.. Rajagopal Reddy Dhima

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా మునుగోడులో గెలిచేది తానే అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, కేఏ పాల్ ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. మునుగోడులో జరుగుతున్నది సాధారణ ఎన్నిక కాదని… కురుక్షేత్ర యుద్ధమని అన్నారు.

ఈ యుద్ధంలో తనతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కలిసిరావాలని చెప్పారు. తన రాజీనామా దెబ్బకు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కూడా మునుగోడుకు వస్తున్నాడని కోమటిరెడ్డి అన్నారు. జనాలను బురిడీ కొట్టించి నమ్మించే తెలివితేటలు కొన్ని రోజులు మాత్రమే నడుస్తాయని… ఆ తర్వాత జనాలెవరూ మీ మాట నమ్మబోరని చెప్పారు.