భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవదహనం

హోల్ సేల్ టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు

చెన్నై: తమిళనాడులోని బాణసంచా తయారీ కేంద్రాల్లో ఇటీవల కాలంలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలోని ఓ బాణసంచా హోల్ సేల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఐదుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కల్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలు ఆ దుకాణం పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీపావళి నేపథ్యంలో ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

కాగా, ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబానికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలను స్టాలిన్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సహాయక చర్యలను కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ జియవుద్దీన్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా షాప్ కు పక్కన ఉన్న దుకాణాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/