హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వర్షాలే

హైదరాబాద్ వాసులకు చల్లటి కబురు. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి ఉరుములతో కూడిన జల్లులు మధ్యాహ్న సమయం లేదా సాయంత్రం వేళల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం లేదని కొద్ది ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

చిరుజల్లులు పడే ఇలాంటి సమయంలో ఒకటి ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని , రాత్రివేళలో ఉష్ణోగ్రతలు ఆహ్లాదకరంగా ఉంటాయని, దాదాపు 22 డిగ్రీల సెల్సియస్‌లో రాత్రులు ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏపీతో పాటు తమిళనాడులోని గత ఐదు రోజుల నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది.