నా దగ్గరికి హీరోయిజాన్ని హైలేట్ చేసే క‌థ‌తో రావద్దంటూ ఆ డైరెక్టర్ కు పవన్ చెప్పాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయాలనీ ప్రతి డైరెక్టర్ కు ఉంటుంది. అలాంటి డైరెక్టర్స్ లలో అనిల్ రావిపూడి ఒకరు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్..ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించాలని వెళ్లాడట. అయితే హీరోయిజాన్ని హైలేట్ చేసే క‌థ‌తో త‌న ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని అనిల్‌కు సూచించాడ‌ట ప‌వ‌న్‌.

ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి కామిక్ జోన‌ర్ స్క్రిప్ట్‌తో కుటుంబ ప్రేక్ష‌కులంతా చూసేలా ఉండాల‌ని అనిల్ రావిపూడికి ప‌వ‌న్ ఓ ష‌ర‌తు పెట్టిన‌ట్టు టాక్. మరి పవన్ చెప్పినట్లు కామెడీ & ఫ్యామిలీ కథను సిద్ధం చేస్తాడో లేదో చూడాలి. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే..ప్ర‌స్తుతం రీమేక్ సినిమాల‌తో బిజీగా ఉంటూనే..మ‌రోవైపు క్రిష్‌లాంటి డైరెక్ట‌ర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హ‌రీష్ శంకర్‌తో కూడా సినిమాను లైన్‌లో పెట్టాడు.