దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు

earthquake

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలోనూ బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్యాలయాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండో సారి. వరుస భూకంపాలతో ఢిల్లీ దాని పరిసర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కాగా, శుక్రవారం నేపాల్‌లోని వాయువ్య ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. ఈ ఘటనలో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపనలు ( వచ్చాయి. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఢిల్లీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.