వైర‌స్‌పై నేను చెప్పిందే నిజ‌మైంది.. ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ క‌రోనా వైర‌స్‌ వుహాన్ ల్యాబ్ నుంచే వ‌చ్చింద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. వైర‌స్‌పై తాను చెప్పిందే నిజ‌మైంద‌ని అన్నారు. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ, శ‌త్రువుగా భావించే వాళ్లు కూడా అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజ‌మ‌ని, చైనా వైర‌స్ వుహాన్ ల్యాబ్ నుంచే వ‌చ్చింద‌ని అంటున్నార‌ని ట్రంప్ అన్నారు. ఈ ల్యాబ్ లీక్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా కోల్పోయిన ప్రాణాల‌కు, జ‌రిగిన న‌ష్టానికి చైనా భారీ ప‌రిహారం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అమెరికాతోపాటు ప్ర‌పంచానికి చైనా 10 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఇవ్వాల‌ని ట్రంప్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/