హైదరాబాద్ లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. నగరంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 21న రెండో విడతలో దాదాపు 13,300 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. లబ్దిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రమేయంలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. లబ్దిదారులు ఎంపిక పూర్తిగా అధికారుల బాధ్యత అన్నారు. కంప్యూటర్ ఆధారికి డ్రా తీసి లబ్దిదారులను ఎంపికి చేస్తున్నట్లు తెలిపారు.

మొదటి దశలో 11,700 ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగితే అధికారులదే పూర్తిస్థాయి బాధ్యత అన్నారు. తప్పు చేసిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించే స్థాయిలో చర్యలు ఉంటాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.