చంద్రముఖి-2 రిలీజ్ డేట్ వచ్చేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్ , జ్యోతిక , నయనతార , ప్రభు ప్రధాన పాత్రల్లో పి.వాసు డైరెక్షన్లో 2005 లో వచ్చిన చంద్రముఖి మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన ఈ మూవీ..ఇప్పుడు సీక్వెల్ గా రాబోతుంది. రాఘవ , కంగనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చంద్రముఖి 2 ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.

అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు.

‘చంద్రముఖి 2’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయటం లేదని, సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ ఓ వీడియోను ఇటీవల విడుదల చేశారు.