కేసీఆర్.. పెన్షన్‌ వెయ్యి పెంచడం తో సంతోషం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు

మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి తన గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 పెంచుతూ శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో ప్రకటించారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116 పెన్షన్‌ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెంచుతున్నట్టు ..ఇది కూడా వచ్చే నెల నుండి అందించబోతున్నట్లు తెలిపి వారిని సంతోషాన్ని నింపారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు..కేసీఆర్ మా దేవుడంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో కన్న బిడ్డలే చూసుకొని ఈ తరుణంలో నెల నెల పెన్షన్ ఇస్తూ..మాకు పెద్ద కొడుకుల కేసీఆర్ మాకు అండగా ఉన్నారని వారు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్ల పాలించిన కాంగ్రెస్‌ ఏ ఒక్కరికీ మంచి చేయలేదని, ఇప్పుడు మళ్లీ వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరి సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ‘పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేడు అంతా సంక్షేమమే. కాంగ్రెస్‌ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని బహిరంగంగానే చెప్తున్నారు. అటువంటి కాంగ్రెస్‌కు అవకాశమిస్తే తెలంగాణలో మళ్లీ దళారీల రాజ్యం, పైరవీకారుల రాజ్యం, పైసలు గుంజేటోళ్ల రాజ్యం వస్తది’ అని ప్రజలను హెచ్చరించారు.