మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ..

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ భూముల్లో పేద ప్రజలు గుడిసెలు వేసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు వారిని గుడిసెలు తొలగించాలని , ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండరాదని పలు హెచ్చరికలు జారీ చేసిన వారు వినడడం లేదు. దాదాపు మూడు వేలకుపైగా కుటుంబాలు గత కొద్దీ నెలలుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు గుడిసెలు తొలగించేందుకు ట్రై చేయగా..వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

ఇళ్లను తీసివేస్తే మా పరిస్థితి ఏంటని వారంతా ప్రశ్నించారు. మా పిల్లలతో మేము ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలమని ఇందులో నివసించడానికి అనుమతి లేదంటూ అధికారులు ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో గుడేసేవాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగుంపు చర్యను మొదలు పెట్టారు. పేదలు వేసుకున్న గుడిసెలను జేసీబీల సహాయం పోలీసు బలగాలతో ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో గుడిసె వాసుల వాగ్వివాదం, తోపులాట చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.