నితిన్ – వెంకీ కుడుముల మూవీ లేటెస్ట్ అప్డేట్

నితిన్ – వెంకీ కుడుముల కలయికలో వచ్చిన భీష్మ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు..అలాంటి కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యముగా భీష్మ మూవీ లో మ్యూజిక్ , నితిన్‌ కామెడీ టైమింగ్‌, పర్‌ఫార్మెన్స్‌, రష్మిక – నితిన్ ల లవ్ ట్రాక్ , రొమాన్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఫిదా చేసాయి. ఇక వెంకీ టేకింగ్, పంచ్‌ డైలాగ్స్ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌చేశాయి. దాంతో మరోసారి వీరి కాంబో అనగానే అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కాగా ఈసారి కామెడీతో పాటు కాస్త అడ్వేంచర్ ను కూడా వెంకీ కుడుముల యాడ్ చేశాడట. అడ్వేంచర్ కోసం సరికొత్త లోకేషన్ల వేటను షురూ చేశారట. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్‌ వక్కంతం వంశీతో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్నాడు. తన సొంత బ్యానర్‌ అయిన శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలిని మేకర్స్‌ చూస్తున్నారు.