ఉత్సాహాన్నిచ్చే మోటివేషన్‌

ఉదయాన నిద్రలేస్తాం. లేవటంతో మైండ్‌ఫ్రెష్‌గా ఉంటుంది. బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది. నిన్నటిరోజు ఎంత చికాకు పరచినా తెల్లారేటప్పటికి నెమ్మదిస్తాం. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. అంటే నిద్రించటం వల్ల మనలోని ఉద్విగ్నతలు తగ్గాయన్నమాట. నిజానికి ఉద్విగ్నతలు సంపూర్ణంగా సమసిపోలేదు. కానీ వాటి తీవ్రత తగ్గింది. కాబట్టే రిలీఫ్‌. ఎమోషన్స్‌ తగ్గాయంటే ఉత్తేజితం కాగల శక్తి మేల్కొనట్లే! దీన్నే డ్రైవింగ్‌ ఫోర్స్‌ అందాం.

Enthusiastic Motivation

అంటే కార్యాచరణపరంగా మనల్ని మున్ముందుకు నడిపించే శక్తి. కంటికి కనిపించని ఇంధనం ఇది. అయినా ఇది మానవ యంత్రాన్ని సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంటుంది. ఇలా మనలోని ప్రతి ఒక్కరిలోను ముందుకు ఉరికే శక్తి ఉంటుంది. మోటివేషన్‌ అంటే ఇదే!జీవితంలో ఏదో సాధించాలనే అనుకుంటాం. గెలుపొందాలనే అను కుంటాం.

అచీవ్‌మెంట్‌, సక్సెస్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌ కావా లని ఆశిస్తాం. ఇలా విజయసాధనలో మనల్ని కర్తవ్యోన్ము ఖుల్ని చేసేది మోటివేషన్‌! మోటివేషన్‌ అనేది ఎప్పటి కప్పుడు ఒక కప్పు కాఫీలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఉల్లాస పరుస్తుంది. నడకనేర్చే వయసులో పిల్లలుపడుతూ, లేస్తూ మళ్లీ మళ్లీ ప్రయత్నించడం మనం చూస్తూనే ఉంటాం. మనం వారినే స్పూర్తిగా తీసుకొని లక్ష్య సాధనకు అకుంఠితంగా ప్రయత్నించి విజయం సాధించాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/