మరోసారి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

గాజా : ఇజ్రాయెల్‌ మరోసారి గాజాపై వైమానిక దాడులు జరిపింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి పాలస్తీనియన్లు పేలుడు బెలూన్లు వదిలారని ఆరోపించింది. ఈ మేరకు వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హమాస్​ కాంపౌండ్​లో దాడి చేశామని, రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. గాజా నగరం, సిటీ ఆఫ్​ ఖాన్​ యూనిస్​పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు స్పుత్నిక్​ మీడియా సంస్థ పేర్కొంది.

కాగా, పాలస్తీనా-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజుల కాక ముందే ఇజ్రాయెల్‌ మరోసారి గాజాపై వైమానిక దాడులు జరిపింది. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/