‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో అమిత్ షాకు ఆహ్వానం…హైదరాబాద్ లో వెలిసిన ప్లెక్సీలు

గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ సర్కార్ vs బిజెపి సర్కార్ అన్నట్లుగా మారింది. కేంద్రం ఫై బిఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోబిజెపి నేతలు ఎవరు తెలంగాణకు వచ్చిన వారికీ బిఆర్ఎస్ సర్కార్ ప్లెక్సీ ల రూపంలో వారిఫై విమర్శలు చేస్తూ వస్తుంది. నిన్నటికి నిన్న బాయ్ బాయ్ మోడీ అంటూ పెద్ద ఎత్తున ప్లెక్సీ లు దర్శనం ఇవ్వగా..తాజాగా ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో అమిత్ షాకు ఆహ్వానం పలికారు.

‘బీజేపీలో చేరితే మరకలు పోతాయి’ అని అర్థం వచ్చేట్టుగా ఈ హోర్డింగులను పెట్టారు. హోర్డింగ్ పై భాగంలో వాషింగ్ పౌడర్ నిర్మా అని.. కింది భాగంలో ‘వెల్‌కమ్‌ టు అమిత్‌ షా’ అని రాశారు. నిర్మా యాడ్ లో ఉండే అమ్మాయి ఫొటోలో ముఖాన్ని మార్చారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన హిమంత బిశ్వ శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, విరూపాక్షప్ప, అరుణ్ ఖోట్కర్ మొఖాలను పెట్టారు. నిన్నటి మాదిరే ఈ రోజు కూడా హోర్డింగ్స్ ఎవరు వేశారనే వివరాలు పెట్టకపోవడం గమనార్హం.

శనివారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అధికారులు విచారించడం ఫై కవితకు మద్దతుగా పోస్టర్లు, హోర్డింగ్ లు దర్శనమిచ్చాయి. పలు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు కొందరు, తర్వాత బీజేపీలో చేరడాన్ని అందులో పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన కవితపై ఎంతటి వేధింపులకు పాల్పడుతున్నా, ఆమె మాత్రం వారిలా రంగులు మార్చలేదని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. పదితలల రావణుడిగా మోదీ ఫొటోను కూడా ఏర్పాటు చేశారు.