నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Minister KTR’s visit to the joint Mahabubnagar district today

మహబూబ్‌నగర్: మంత్రి కేటీఆర్‌ నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకద్ర, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ (సిద్దాయపల్లి) వద్ద నిర్మించిన 288 డబుల్‌ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తారు. భూత్పూర్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్‌-నాన్‌ వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. వర్నే-ముత్యాలపల్లి రోడ్డుపై బ్రిడ్జి, గుడిబండకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. భూత్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

సభ తర్వాత కోస్గి పట్టణానికి చేరుకుంటారు. పట్టణంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. పంచతంత్ర పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. కోస్గి బస్‌ డిపోను ప్రారంభిస్తారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/