భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొనబోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి తన పడ్డయాత్రకు తనను ఆహ్వానించలేదని , అందుకే పాల్గొనలేదని వెంకటరెడ్డి తెలిపారు. కానీ భట్టి విక్రమార్క చేపట్టబోయే పాదయాత్రకు ఆహ్వానించారని , అందుకే ఆయన పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. ఈరోజు భట్టి తో వెంకటరెడ్డి హైదరాబాద్ లో భేటీ అయ్యారు.

అనంతరం మీడియా తో వెంకటరెడ్డి మాట్లాడారు. భట్టి విక్రమార్క పాదయాత్రపై కొన్ని సూచనలు చేశానని వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్గొండ, మంచిర్యాల, జడ్చర్ల/షాద్ నగర్ లో బహిరంగ సభ… నకిరేకల్, సూర్యాపేటలో మినీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించినట్టు వివరించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో… శని, ఆదివారాల్లో మాత్రమే పాదయాత్రలో పాల్గొంటానని వెల్లడించారు.

హాత్‌ సే హాత్‌ హాత్‌ జోడో అభియాన్‌లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు మొత్తం 91 రోజుల పాటు భట్టి పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలోని పిప్పిర నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర కొనసాగి ఖమ్మంలో ముగియనుంది.