ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఫైర్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉన్నత స్థాయిలో ఉండి కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటె ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు, పోలీసులపై పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ ల ఒత్తిడి ఉంటుందని మోహన్ బాబు అన్నారు.

‘సార్ ఇది నిజం, ఇది జరిగింది, నేను కళ్లా చూశాను, మీరు తప్పు చెప్పమంటున్నారు, నేను నిజం చూశాను’ అని కింది స్థాయి వాళ్లు చెపితే అతని ఉద్యోగం పోతుందని అన్నారు. పై స్థాయి అధికారుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారని చెప్పారు. ఈ విషయాన్ని తాను బహిరంగంగా చెపుతానని అన్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కు తాను ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తానని, అయితే వ్యవస్థలో జరుగుతున్నది మాత్రం ఇదేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు మీడియా లో వైరల్ గా మారాయి.