విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

Hon’ble Union Minister and Hon’ble CM of AP will be Participating in Public Meeting at IGMS LIVE

విజయవాడ: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న 31 జాతీయ రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్‌తో కలిసి ఆయన ఈ పనులకు శంకుస్థాపన చేశారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని అన్నారు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో వేగంగా పనులు, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో మిగిలిన రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/