జగనన్న విద్యాకానుకను ప్రారంభించిన సీఎం జగన్

YouTube video
Hon’ble CM will be Distributing Jagananna Vidyakanuka Kits to the School Students at Adoni, LIVE

ఆదోనిః జగనన్న విద్యా కానుక ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 47.40లక్షల మంది స్కూల్ విద్యార్థులకు విద్యా కానుక ఉపయోగపడుతుంది. ఈసందర్భంగా క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో సిఎం జగన్‌ ముచ్చటించారు. విద్యాకానుక కిట్లు, పుస్తకాలను జగన్‌ పరీశీలించారు. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్ల ఖర్చు చేశారు.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడతూ.. వరుసగా మూడో విడత విద్యాకానుకను అందిస్తున్నాం. 47 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుకను ఇస్తున్నాం. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్‌ ఉండాలని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు. అక్టోబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/