జనసేన కార్యకర్తలకు పవన్ విన్నపం

ఇటువంటి నిరసనల్లో పాల్గొనకండి..బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టండి

pawan kalyan
pawan kalyan

విశాఖ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ గ్యాస్‌ లీక్‌ సంఘటనపై స్పందించారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై స్థానికులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఇందులో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనవద్దని పవన్‌ సూచించారు.
‘జనసేన నేతలు, జనసైనికులకు నేనొక విన్నపం చేస్తున్నాను. ఇటువంటి నిరసనల్లో పాల్గొనకండి. దయచేసి బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టండి. ఆందోళనలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. గ్యాస్‌ లీక్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నివేదికలు అందేవరకు వేచి చూద్దాం’ అని చెప్పారు. కాగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/