హోలి. వసంతకేళి

హోలి పండుగను బ్రాజ్‌ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్‌, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.

Holy Festival

హోళీ పండుగను బ్రాజ్‌ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్‌, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.

హోళీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. హోలి రోజున ప్రజలు రంగుల పొడిని, రంగునీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు.

ముందురోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పింటిస్తారు. దీనిని హోలిక దహన్‌ అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు.

అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటల్లో దహనమయింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడికి ఎటువంటి అపాయం జరగదు. దీనిని కామదహనం అని కూడా అంటారు. ఈ పండుగను సాధారణంగా ఫాల్గుణమాసం, పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఫాల్గుణ బహుళ పంచమి రోజును పండుగ ముగింపుకు సూచనగా రంగులతో రంగ పంచమి ఉత్సవానికి జరుపుకుంటారు.

రాక్షస రాజు హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందుతాడు. ‘పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు.

దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం, భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్లని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించగా అందుకు విరుద్ధంగా హిరణ్యకశ్యపుడి పుత్రుడు ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్ధించేవాడు.

Holy Colours

అతడి నోటిలో విషయం పోస్తే అది అమృతంలా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. విష సర్పాలు కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేదు. హిరణ్యకశ్యపుడు తన కుమారుడిని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి సోదరి హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆదేశిస్తాడు.

ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీ జరుపుకుంటున్నాము.

ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు.

కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని మ్ముతారు. హోలీ పుట్టుక గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడు మన్మథుడు గురించి తెలుపతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన మన్మథుడిని శివుడు తన మూడో కంటితో భస్మం చేస్తాడు.

మన్మథుడి భార్య రతి కోరిక మేరకు శివుడు మన్మథుడిని మరలా బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియచేసే మానసిక ప్రతిరూంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలి రోజున భోగిమంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ.

ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి. అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయి వృద్ధి పొంది, వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగటం వల్ల వైరల్‌ జ్వరం, జలువు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని సహజమైన రంగులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్ధం. సంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.

కొన్నిసార్లు గంజాయిని బట్టి కెనబిస్‌ సెటైనా ఒక ముఖ్యమైన పానీయము తండై లేదా భంగ్‌ను తయారుచేస్తారు. తడిగా రంగుల కొరకు మోదుగ పువ్వులను రాత్రంతా మరిగించ అవి పసుపు రంలోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరు వ్యాపారా లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయింది. అబీర్‌, గులాలు లాంటి రంగులతో ఈ పండుగ జరుపుకుంటారు.

నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. ఈ రంగు నీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. దీనికి మొదట వృక్షం నుండి సేకరిస్తారు. ఎండలో ఎండబెడతారు. వాటిని నూరిన తరువాత నారింజ – పసుపు రంగులోకి మారేందుకు నీటిని కలుపుతారు. ఇప్పుడు ఎరుపు రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువును విసురుకుంటున్నారు.

అది ఎదుటి వారికి తగిన వెంటనే పగిలి, వారిపై పొడి వెదజల్లుతుంది. పంజాబ్‌లో సిక్కులు ఈ పండుగను హోలా మెహల్లా అంటారు. భారతదేశం మొత్తంలో ఆనంద్‌పూర్‌ సాహిబ్‌లో రిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది.

విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి వారి సంప్రదా పద్ధతిలో హోలి జరుపుకొంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బర్సాన ప్రదేశం హోలి పండుగకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాధారాణి ఆలయంలో లాత్‌ మార్‌ హోలి అనే క్రీడను ఆడతారు.

లాత్‌ మార్‌ హోలీలో కొన్ని వేల మంది స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. హోలీ పాటలు పాడుకుంటూ పెద్దగా శ్రీ రాదే శ్రీకృష్ణ అంటూ పాడతారు. బ్రజ్‌ బాషలో ఈ పాటలను పాడతారు. కృష్ణుడి జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.

పండుగను 16 రోజులు సంప్రదాయక పద్ధతులలో ఆచారవ్యవహారాలతో కృష్ణుడిని పూజిస్తారు. బీహార్‌లో హోలీని మనోహరంగా జరుపుకుంటారు. బెంగాల్‌లో డోల్‌ పూర్ణిమ ఉదయం వేళలో విద్యార్థులు కుంకుమ పువ్వు రంగు దుస్తులు, పరిమళాలు వెదజల్లే పూల మాలలు ధరిస్తారు. సంగీత పరికరాలైన ఎక్‌తార, డుబ్రి, వీణా మొదలగువాటికి తగ్గట్లు నృత్యం చేస్తారు. గుజరాత్‌లో హోలీని శోభాయమానంగా జరుపుకొంటారు.

మహారాష్ట్రలో హోలీ పౌర్ణమిని షింగా వలె జరుపుకొంటారు. దక్షిణ భారతదేశంలోని కొచి ప్రాంతంలోని మటన్‌చెర్రీలో సామరస్యంతో జీవిస్తున్నా 22 సంఘాల వారు ఉన్నారు.

దక్షిణ కొచి ప్రదేశమైన చెర్‌లై ప్రాంతంలో కొంకణి భాష మాట్లాడే గౌడ్‌ సరావత్‌ బ్రాహ్మణులు హోలీ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఒక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రజలు హోలి పండుగను ఎంతో వైభవంగా జరుపుకొంటారు. చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు జల్లుకుని ఆనందిస్తారు. నేపాల్‌లో ఈ పండుగను ఒక గొప్ప పండుగగా పరిగణిస్తారు.

నేపాల్‌లో 80 శాతం ప్రజలు హిందువులు ఉన్నారు. చాలా వరకు హిందువుల పండుగలను జాతీయ పండుగగా జరుపుకొంటారు. ప్రతి ఒక్కరు ప్రాంతీయ భేదం లేకుండా జరుపుకొంటారు. చివరికి ముస్లింలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు.

ఒకరిపై ఒకరు రంగులోనీళ్లు జల్లుకోవటాన్ని లాోలా అంటారు. వివిధ రంగులతో ఆడుకోవటం వల్ల వారి యొక్క బాధలు తొలగిపోయి, రాబోయే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతారు.

హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ. రంగులలో రసాయనాలు ఎక్కువే ఉంటాయి. అయితే ఈ మధ్య చైనాలోని వుహాన్‌లో వచ్చిన కరోనా వైరస్‌ వల్ల వేల మంది చనిపోతున్నారు. ఆ వైరస్‌ ఇతర దేశాలకు కూడా వ్యాపించి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రసాయనతో కూడిన రంగులు ఈ పండుగ రోజున ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి హోలీ పండుగను జరుపుకోవద్దని ప్రచారం జరుగుతున్నది. అయినప్పటికీ సంప్రదాయబద్ధమైన ఈ పండుగను కొన్ని జాగ్రత్తలు పాటించి జరుపుకోవచ్చని మరో వాదన కూడా ఉంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com