‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో ఆ వస్తువులు ఉండాలి

3 జతల డ్రెస్సులు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్టు, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు ఉండాలి

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ పాఠశాల విద్యపై ఈరోజు సమీక్ష నిర్వహంచారు. ఈసమీక్షలో సిఎం జగన్‌ ‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో ఆరు రకాల వస్తువులు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కిట్ లో మూడు జతల డ్రెస్సులు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్టు, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు ఉండాలని సూచించారు. పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని, పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్ లు పంపిణీకి సిద్ధం చేయాలని, నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తి కావాలని జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై కూడా సమీక్షించారు. ‘జగనన్న విద్యా కానుక’నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ, గోరుముద్ద, మధ్యాహ్న భోజనంపై యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయనకు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/