ఒబామా, జో బిడెన్, బిల్ గేట్స్ ఖాతాలు హ్యాక్

టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ జెఫ్ బెజోస్ ఖాతాలు కూడా

Twitter hacked in major breach, accounts of Obama, Biden, Gates

హైదరాబాద్‌: పలువురు అంతర్జాతీయ ప్రముఖుల ట్విటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గుర‌య్యాయి. . ఇందులో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా, అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియన్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీరి అధికారిక ఖాతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ట్వీట్లు చేశారు. వెంటనే అప్రమత్తమైన ట్విటర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.

అంతేకాదు ఉబెర్, యాపిల్ కార్పొరేట్ ఖాతాలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ట్విటర్ తెలిపింది. ప్రముఖ క్రిప్టో ట్విటర్ ఖాతాలు కామెరాన్, టైలర్ వింక్లివోస్, జెమిని క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్, కాయిన్ ఎంబేస్ యాప్‌లు సైతం హ్యాకర్ల బారినపడ్డాయి. కాగా ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్ గురైన వ్యవహారంపై విచారణ చేస్తున్నామని ట్విటర్ సపోర్ట్ టీమ్ ట్వీట్ చేసింది. సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/