భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

రూ.266 పెంపు..ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య‌ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,000.50
గృహాల్లో వాడే ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పుల్లేవు

న్యూఢిల్లీ : గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచేశాయి. నేటి నుంచి వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ.266 పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే, గృహాల్లో వాడే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచక‌పోవ‌డం కాస్త ఊర‌టనిస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర నెలకోసారి మారుతోన్న విష‌యం తెలిసిందే. ఆ సిలిండర్లు కొనుగోలు చేసిన అనంత‌రం సబ్సిడీ మొత్తం నేరుగా ల‌బ్ధిదారుల‌ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

కాగా, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య‌ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,734 నుంచి రూ.2,000.50 కు పెరిగింది. ముంబైలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133కు చేరింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతుండ‌డంతో ఆందోళ‌న చెందుతోన్న ప్ర‌జ‌ల మీద గ్యాస్‌ ధరల భారం కూడా ప‌డుతోంది. వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, ఇత‌ర సంస్థ‌లు వినియోగిస్తుంటాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/