ఒకటో తేదీ వచ్చింది..గ్యాస్ ధర ను ఏకంగా రూ. 265 పెంచింది

ఒకటో తేదీ వచ్చిందంటే సామాన్యులకు షాక్ అనే చెప్పాలి. ప్రతి నెల ఒకటో తేదీన కొత్త గ్యాస్ ధరలు వస్తుంటాయి. ఇక నవంబర్ ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకటి , రెండు కాదు ఏకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 265 కి పెరిగింది. ధర పెంపు నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిడర్ ధర ఢిల్లీలో రూ.2 వేలు దాటిపోయింది.

ఇది వరకు ఈ సిలిండర్ ధర రూ.1733గా ఉండేది. ముంబైలో అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1950కు చేరింది. ఇది వరకు దీని ధర రూ.1683. కోల్‌కతాలో అయితే రూ.2073కు చేరింది. ఇక చెన్నైలో అయితే ఈ సిలిండర్ ధర రూ.2133కు ఎగసింది. కాకపోతే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం ఊరటనిచ్చే వార్త అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సిలిండర్ ధర వెయ్యి కి పది తక్కువగా ఉంది. అతి త్వరలో దీని ధర కూడా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.