అమెరికాలో భారీగా కరోనా మరణాలు
ఒక్క రోజులోనే 1,514 మంది మరణం

వాషింగ్టన్: కరోనా ప్రభావం అమెరికాలో రోజురోజుకు ఎక్కువ అవుతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,514 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 22,020 కు చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనా భాదితుల సంఖ్య 5,59,409 కు చేరింది. ఇప్పటికే కరోనా మరణాలలో మరియు భాధితుల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలోకి చేరుకుంది. నిపుణల అంచనా ప్రకారం యూఎస్‌లో వైరస్ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకునేందకు దగ్గరగా ఉందని తెలుస్తుంది. న్యూయార్క్ రాష్ట్రంలో ఒక్కరోజులోనే 758 మంది మృతి చెందారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 9,385 కు చేరింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/