విరూపాక్ష మూవీ టాక్ ..

Virupaksha Movie

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా , కాంతారా ఫేమ్ అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు కీలక పాత్రలను చేశారు. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మూవీ చూసిన ప్రేక్షకులు , అభిమానులు సినిమాకు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. ‘విరూపాక్ష’ ఫస్టాఫ్ అదిరిపోయిందని , సాయిధరమ్ తేజ్ లుక్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని.. డైరెక్టర్ కార్తీక్ సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశాడని , కథను నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని అంటున్నారు. సుకుమార్ రాసిన స్క్రీన్‌ప్లే అయితే ప్రేక్షకుడిని సీటులో నుంచి కదలనివ్వదని చెబుతున్నారు. సినిమాను నేపథ్య సంగీతం మరో హైలైట్ అని అంటున్నారు.

మరికొంతమంది ‘బోరింగ్ లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ.. కథాంశం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని చిల్లింగ్ మూమెంట్లతో ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా బాగా పుంజుకుంది. దీనికి సౌండ్ మిక్సింగ్ బాగా సెట్ అయ్యిందని తెలిపాడు. ‘ఒక చంద్రముఖి.. ఒక అరుంధతి.. ఒక కాంచన.. ఒక విరూపాక్ష. వీక్ హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఈ సినిమాకు వెళ్లకండి. మొదటి పది నిమిషాల లవ్ ట్రాక్ తప్ప మిగిలిదంతా హర్రర్‌గానే ఉంది. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఓవరాల్ గా సినిమా కు పాజిటివ్ టాక్ వస్తుండడం తో మెగా అభిమానులు , చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.