నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు- సీఎం రేవంత్

జనవరి 31 గద్దర్ జయంతి సందర్బంగా ..హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేసారు. సినీ ప్రముఖులు నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామన్నారు. కళాకారులకు గద్దర్ పేరుతో పురస్కారాలు ఇచ్చి గద్దరన్నకు గౌరవించుకుందాం అన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే డాది ఏనుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని వెల్లడించారు. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామన్నారు.

సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న అని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి.. ఆయనతో మాట్లాడితే మాకు 1000 ఏనుగుల బలం వస్తుందన్నారు. ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చినట్లు రేవంత్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.