చైనా కుబేరుడిని అధిగమించిన ముఖేశ్‌ అంబానీ

49.2 బిలియన్ డాలర్లకు చేరుకున్న ముఖేశ్ సంపద విలువ

Mukesh Ambani
Mukesh Ambani

ముంబయి: ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ జియో-ఫేస్‌బుక్‌ ఒప్పందంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ నిన్న ఏకంగా 10 శాతం వరకు పెరిగింది. దీంతో ఆయన ఆసియాలోనే అత్యంత సంన్నుడి స్థానాన్ని తిరిగిపొందారు. బ్లామ్‌బెర్గ్‌ ఆసియా కోటేశ్వరుల జాబితాలో ఇప్పటి వరకు ప్రథమ స్థ్థాంలో ఉన్న చైనా ఈకామర్స్ సంస్థ ‘అలీబాబా’ అధినేత జాక్ మాను అధిగమించారు. ముఖేశ్ సంపద విలువ నిన్న ఒక్కరోజే 4.7 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ క్రమంలో, ఆయన సంపద 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, జాక్ మా సంపద కంటే 3.2 బిలయన్ డాలర్ల ఎక్కువ సంపదతో ముఖేశ్ మరోసారి ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా అవతరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/