అయోధ్య లో భారీ భద్రత..

ప్రపంచం మొత్తం ఇప్పుడు అయోధ్య వైపే చూస్తుండడం తో అక్కడ కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. మరికాసేపట్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు అయోధ్య కు లక్షలాది మంది భక్తులు , వేలాదిమంది VIP లు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు.

13 వేల మంది పోలీసు సిబ్బందితో పలు అంచెల బందోబస్తు, నగరవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. జాగిలాలు, బాంబు స్క్వాడ్‌ బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఎన్డీఆర్‌ఎఫ్‌, వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. గగనతల నిఘా కోసం డ్రోన్లు, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు అత్యాధునిక యాంటీ-మైన్‌ డ్రోన్లను రంగంలోకి దించాం” అని ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. పర్మిషన్‌ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. స్థానికంగా 51 నిర్దేశిత ప్రదేశాల్లో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 22 వేలకుపైగా వాహనాలను నిలపవచ్చు. ఈ ప్రదేశాలు నిరంతరం డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటాయి. మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు.